సమ్మెహనం సినిమా సక్సెస్ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు యువ హీరో సుధీర్ బాబు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈసినిమా బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఆ సినిమాను మరవక ముందే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటివలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. తాజాగా మూవీకి సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈమూవీతో కన్నడ నభా నటేశ్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది.
ఈచిత్రానికి ఆర్.ఎస్ నాయడు దర్శకత్వం వహించగా.సుధీర్ బాబు తన సొంత బ్యానర్ లో ఈమూవీని నిర్మించారు. ఈచిత్రంలో నాజర్, తులసీలతో పాటు పలువురు సీనియర్ నటులు నటీంచారు. ఈమూవీకి అజనీష్ సంగీతాన్ని అందించాడు. ఇటివలే విడుదలైన టీజర్ లో డైలాగ్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.సుధీర్ నటించిన సమ్మెహనం సినిమా సూపర్ హిట్ కావడంతో ఈసినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి.