ఝాన్సీ గా వస్తున్న జ్యోతిక

264
Jyothika

స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల సొంత ద‌ర్శ‌క‌,నిర్మాణంలో తెర‌కెక్కించిన మూవీ నాచియార్. ఈ చిత్రాన్ని తెలుగు లో డి వెంకటేష్ డి వి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై విడుదల కానుంది. త‌మిళనాట రిలీజ్ అయి విశేష ప్రేక్ష‌క ఆధ‌ర‌ణ పొందిన చిత్రంగా, ప‌లు రికార్డ్ ల‌ను క్రియేట్ చేసింది. క్రైమ్ డ్రామాగా వ‌చ్చిన ఈ చిత్రంలో విభిన్న పాత్ర‌ల‌తో త‌న‌దైన న‌ట‌న‌, అభిన‌యంతో క‌థ‌ను ర‌క్తిక‌ట్టించ‌గ‌ల స్టార్ హీరోయిన్ జ్యోతిక‌, పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ ను ప్ర‌ద‌ర్శించారు. జ్యోతిక‌ న‌ట‌న‌కు స్టార్ హీరోలు సైతం ప్ర‌శంస‌ల‌ను కురింపిచాడు. ముఖ్యంగా సూర్య ఈ మూవీని చూసి మంచి పాజిటివ్ కామెంట్ ని ఇచ్చారు. సూర్య‌ న‌టించిన సింగం సీక్వెల్స్ తో పోలిస్తే జ్యోతిక యాక్ష‌న్, డైలాగ్స్ లో త‌న‌ని అబ్బుర‌ప‌రిచాయ‌ని, త‌న‌లో జ్యోతిక‌ని చూసుకున్నాన‌ని సూర్యా చెప్పారు. అలాగే ఏ పాత్ర‌నైనా ఛాలెంజింగ్ గా చేయ‌గ‌ల యాక్ట‌ర్ జివి.ప్ర‌కాష్ న‌ట‌న సైతం ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌ట‌మే కాక‌, సినీ ప్ర‌ముఖుల నుండి ప్ర‌శంస‌ల‌ను అందుకున్నారు. మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే…త‌న స్వ‌రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల‌న్ని చేసే మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం…ఈ మూవీ స‌క్సెస్ కి ప్ర‌ధార‌ణ కార‌ణం అయింది.

ఇంతటి భరివిజయం సాధించిన ఈ సినిమా తెలుగు దుబ్బింగ్ హక్కులు మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్న డి వెంకటేష్ , డి వీ సినీ క్రియేషన్స్ మరియు కల్పనా చిత్ర బ్యానర్ వారు సంయుక్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాని తెలుగు లో ఝాన్సీ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి యశ్వంత్ మూవీస్ సమర్పకులు.

jyothika jhansi

ఇంత భారీ స‌క్సెస్ ని అందుకున్న‌ నాచియార్ మూవీ ఇప్పుడు తెలుగులో మ‌రిన్ని సంచ‌నాలు తెర‌లేప‌టానికి వ‌స్తుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం యొక్క టీజ‌ర్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తెలుగులోకి వ‌స్తున్న ఈ మూవీకి ఇప్పటికే మార్కెట్ వ‌ర్గాల నుండి భారీ ఆధ‌ర‌ణ క‌లుగుతుంది. జ్యోతిక చాలా రోజులు త‌రువాత తెలుగులో వ‌స్తుండ‌టం అనేది తెలుగు మార్కెట్ లో ఈ మూవీకి ఎంతో ప్ల‌స్ గా ఉంది.