ఆగస్టు 12వ తేదీ నిర్వహించనున్న శుద్ధ తిరుమల- సుందర తిరుమల కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు.టీటీడీ పరిపాలన భవనంలో శుక్రవారం ఆమె ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తిరుమల పవిత్రత, పర్యావరణాన్ని కాపాడటానికి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి పిలుపు మేరకు ఈ ఏడాది మే 13వ తేదీ తొలిసారిగా నిర్వహించిన శుద్ధ తిరుమల సుందర తిరుమల కార్యక్రమం విజయవంతమైందన్నారు.
12వ తేదీ విద్యార్థిని విద్యార్థులతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని కూడా అదే తరహాలో విజయవంతం చేయాలన్నారు. టీటీడీ కళాశాలల, ఎన్ఎస్ఎస్, ఎన్ సిసి, ఇతర విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మొదటి, రెండవ ఘాట్ రోడ్లు, రెండు నడకదారులను ఏడు సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టారుకు ప్రత్యేకాధికారిని నియమించాలని ఆమె ఆదేశించారు. హెల్త్, ఫారెస్ట్, విజిలెన్స్ విభాగాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె చెప్పారు.
Also Read:నంది అవార్డు వేడుకతో సంబంధం లేదు..!
విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ఆహారం, టి, స్నాక్స్ ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళు తిరుపతి అన్నదానం విభాగంతో సమన్వయం చేసుకుని ఏర్పాటు చేయాలన్నారు. చెత్త వేసే కవర్లు, డస్ట్ బిన్లు, డిస్పోజల్ మాస్కులు, పరకలు, గ్లౌజులు సిద్ధం చేయాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. సీఎంఓ మెడికల్ టీం ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
Also Read:నో డౌట్.. ముందస్తు ఎన్నికలు?