- Advertisement -
సూడాన్‌లో అంతర్యుద్ధం చెలరేగగా ఈ ఘటనలో 114 మందికి పైగా మృతిచెందారు. ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఇటీవల పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు దాడి చేశాయి. పశ్చిమ సూడాన్‌లోని నార్త్ డార్ఫర్‌లోని రెండు శిబిరాలపై కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో దాదాపు 114 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్టేట్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖతీర్ వెల్లడించారు. జాబ్జామ్‌లోని పౌరుల శిబిరాలపై శుక్రవారం ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులు చేయగా ఈ దాడుల్లో 100 మందికి పైగా మృతి.. పలువురికి గాయాలు అయ్యాయి.
మరణించిన వారిలో తొమ్మిది మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ ఉద్యోగులు ఉండగా ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు బలగాలు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read:హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ షాక్..
- Advertisement -