భారత ప్రయాణీకులపై సుడాన్ ఆంక్షలు..

75
sudan

భారత ప్రయాణీకులపై వివిధ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో సుడాన్ చేరింది. భారత్ నుండి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై సూడాన్ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింది. రెండు వారాల‌పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని…. ఆఫ్రికాలో అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతున్న ఈజిప్ట్‌, ఇథియోపియా దేశాల ప్ర‌యాణికుల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంద‌ని సుడాన్ అధికారులు వెల్లడించారు.

సుడాన్ ఇప్పటికే కరోనాతో సతమతమవుతోంది. వైద్యరంగంలో సౌక‌ర్యాలు అంతంత మాత్రంగానే ఉండటంతో స్కూళ్లు, యూనివ‌ర్సిటీల‌ను మూసివేసింది. సుడాన్‌లో ఇప్పటివరకు ల‌క్ష మందికిపైగా క‌రోనా బారిన‌ప‌డ్డారు.