వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడమనేది 365 రోజులూ ఉండే కార్యక్రమాలే! కానీ ఆ బిజీ షెడ్యూల్ నుంచి ఒక రోజు ను సమాజం కోసం కేటాయిస్తే అది చూపే ప్రభావం ఎనలేనిది. ఇది దృష్టి లో పెట్టుకునే మేం పలు కార్యక్రమాలను చేయడంతో పాటుగా నవంబర్28ను సంకల్ప్ దివస్ గా ప్రతి సంవత్సరం నిరహిస్తున్నారు.
సుచిర్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు లయన్ వై. కిరణ్ మాట్లాడుతూ.. ఒకరోజు పాటు జరిగే ఈ సంకల్ప్ దివస్ ద్వారా సామాన్య ప్రజలకు స్పూర్తి కలిగిస్తూనే, కార్పొరేట్ సంస్థలు సమాజంలో అంటర్బగమేయందుకు, ఇతరులు తమ సమయంలో కొంత వెచ్చించి తమను తాము సమాజానికి పునరంకితం చేసుకునేందుకు స్పూర్తిని కలిగిస్తున్నాం.వార్షిక వేడుకలను రెగ్యులర్ గా చేసుకునే పార్టీల్లా కాకుండా సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆయా రంగాల్లో సుప్రసిద్ధ వ్యక్తుల కృషిని గుర్తిస్తూ వారిని ప్రజల సమక్షంలో సత్కరిస్తుంది. శ్రీ అన్నా హజారే, శ్రీ సుందర్ లాల్ బహుగుణ, శ్రీ సందీప్ పాండే, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ మందాకిని, శ్రీ మహేష్ చంద్ర మెహతా, శ్రీ జాకిన్ ఆర్పుదాం, శ్రీ చండీ ప్రసాద్ భట్, శ్రీ కులందయ్ ఫ్రానిస్, డాక్టర్ కిరణ్ బేడీ, శ్రీమతి నఫిసా మరియు యాసిడ్ ఎటాక్ సర్వైవర్ లక్మి అగర్వాల్ వంటి సామాజిక వేత్తలను గత 11 సంవత్సరాలుగా సత్కరించింది.
ఈ సంవత్సరం ఇండియన్ నటి మరియు డైరెక్టర్ నందితా దాస్ ని సంకల్ప్ సంజీవిని పురస్కారంతో ఘనంగా సత్కరించారు.ఈ సత్కార కార్యక్రమంలో సింగర్ పి. సుశీలా, డాక్టర్ ఆదిష్ సి.అగర్వాల్ ప్రెసిడెంట్ ఇంటల్ కౌన్సిల్ ఆఫ్ లండన్ చైర్మన్ ఆఫ్ ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ న్యూ ఢిల్లీ ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు.చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో సత్యసాయి నిగమాగమంలో ఈ కార్యక్రమం ప్రారంభంమైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు లను మహోన్నత వ్యక్తులకు అందజేయడం తో పాటుగా ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారుల ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆక్షరణ గా నిలిచాయి.