సుచీలీక్స్: పార్ట్‌-3

264
Suchi Leaks Trending Again...
- Advertisement -

ఏడాది పూర్తైంది. అయినా సరే…మళ్ళీవస్తున్నానంటూ సుచిత్ర ట్విట్టర్‌లో రాతలు కనిపిస్తున్నాయి. సింగర్‌ సుచిత్ర ట్విట్టర్ నుంచి అప్పట్లో కొంతమంది సినీస్టార్ల రాసలీలలకు సంబంధించిన ఫోటోలు బయటపడ్డ విషయం తెలిసిందే. అప్పట్లో సుచీలీక్స్ పై తీవ్ర విమర్శలు కూడా వినిపించాయి.

తాజాగా…మీకు ఎవరి న్యూడ్ ఫోటోలు కావాలి? చెప్తే చూపిస్తా… అంటూ కొంతమంది ఫేమస్ హీరో హీరోయిన్ల పేర్లను సింగర్ సుచిత్ర వెల్లడించడంతో తమిళ నటీనటులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ఏడాది పూర్తయింది… మళ్లీ వస్తున్నా’ అంటూ ఆదివారం నాడు తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించి సంచలనం రేపిన ఆమె, ఈసారి యువతులు స్నానం చేస్తున్న కొన్ని దృశ్యాలను చూపించింది. గతంలో సుచీలీక్స్ పేరిట వెల్లడైన దృశ్యాలతో పోలిస్తే, ఇవి మరింత అసభ్యకరంగా ఉండటంతో ఇప్పుడు దుమారం చెలరేగుతోంది. ఇక సుచీ లీక్స్ వ్యవహారానికి పూర్తిగా చెక్ పెట్టేందుకు కోలీవుడ్ పెద్దలు కదిలినట్టు టాక్‌.

 Suchi Leaks Trending Again...

గత సంవత్సరంలో నటి నివేదా పేతురాజ్ శృంగార దృశ్యాలను సుచిత్ర పోస్టు చేసిన తరువాత, రానా, త్రిష, నయనతార, ధనుష్, శింబు సహా పలువురు నటీనటుల ప్రైవేటు చిత్రాలను పోస్టు చేసింది. ఆపై తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసి వివాదానికి దూరంగా ఉంది. తిరిగి ఇప్పుడు మరోసారి సంచలనానికి తెరతీస్తోంది సుచిత్ర.

మొత్తానికి ఇప్పుడు కూడా సుచిత్ర తన ట్విట్టర్ ఖాత హ్యాక్‌ కి గురైందని పాత ముచ్చటే చెబుతుందా..? లేక ఇతర కారణాలను చెప్పే ప్రయత్నం చేస్తుందా..? అనేది తేలాల్సి ఉంది.

- Advertisement -