బన్ని… తగ్గే ప్రసక్తే లేదట..!

175
- Advertisement -

గత కొద్ది రోజులుగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య’ విడుదల తేదీని మార్చినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు హల్చల్‌ చేస్తోన్న విషయం తెలిసిందే.

తొలుత ఈ సినిమాను ఏప్రిల్‌ 27న విడుదల చేసేందుకు ఫిక్సైంది చిత్ర యూనిట్‌. అయితే.. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భరత్‌ అను నేను’ సినిమా విడుదల కూడా ఏప్రిల్‌ 27నే ఉండటంతో ఓపెనింగ్స్‌ దెబ్బతినకూడదని ‘నా పేరు సూర్య‘ను ఏప్రిల్‌ 13న విడుదల చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

Mahesh Babu vs Allu Arjun on April 27

అయితే ఇప్పుడా వార్తలకు చెక్‌ పెట్టారు చిత్ర నిర్మాతలు. ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదని, ‘నా పేరు సూర్య’ ను ఖచ్చితంగా అనుకున్న డేట్‌ కే రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు.ఇదిలా ఉండగా వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ‘నా పేరు సూర్య’ లో బన్నీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. మొత్తానికి ‘సూర్య‘ ‘భరత్‌’ ల మధ్య ఎలాంటీ పోటీ ఉండబోతోందనే ఆసక్తితో ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.

- Advertisement -