తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం..

238
Success Stories on the Telangana Government startps
- Advertisement -

ఎన్నారై టి. ఆర్. యస్ యుకె మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యం లో “తెలంగాణ గవర్నమెంట్ సక్సెస్ స్టోరీస్ ఆన్ స్టార్ట్ప్స్” అనే కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో హైదరాబాద్ కి చెందిన “స్పార్క్ టెన్ ఆక్సిలేటర్” అనే సంస్థ ప్రోత్సాహం తో బ్రిస్కీ అనే కంపెనీని పెట్టి విజయవంతంగా ముందుకు వెళ్తున్న యువ స్టార్ట్ప్ వ్యవస్థాపకులు జతిన్ భాటియా మరియు రాజేష్ భుటాడా లు అతిథులుగా పాల్గొన్నారు.

ఎన్నారై టి. ఆర్.యస్ యుకె ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమం లో ముందుగా ఇటీవల యుకె పార్లమెంట్ ముందు జరిగిన ఉగ్రవాది దాడి లో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించి, తరువాత ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పెద్దిరాజు సంతాప సందేశాన్ని సభకు తెలిపారు.

Success Stories on the Telangana Government startps

అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ స్టార్ట్ప్స్ ప్రోత్సాహం మరియు విజయాల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శనంగా ఉందని, టీ – హబ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలని సభకు వివరించి, పలు సందర్భాల్లో తెలంగాణ ఐ.టీ మంత్రి కే. టీ. ఆర్ చేసిన ప్రసంగాలని సభలో లో ప్రదర్శించారు. అలాగే తెలంగాణ అభివృద్ధి లో తమ వంతు బాధ్యత నిర్వహిస్తు యువతను స్టార్ట్ప్ వైపు ప్రోత్సహిస్తున్న “స్పార్క్ 10 సంస్థ” సేవలను ప్రశంసించారు, ముఖ్యంగా సీఈఓ అటల్ మాల్వియా కృషిని అభినందించారు. ఈ రోజు కార్యక్రమానికి అన్ని రకాల సహాయాన్ని అందించిన స్పార్క్ 10 సంస్థకు కృతఙ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్ ద్వారా రూపొందించిన ఆవిష్కరణలు ప్రపంచ స్థాయిలో గుర్తింపును దక్కించుకుంటున్నాయని. ఇటీవలి కాలంలో 4 స్టార్టప్‌లకు అంతర్జాతీయ అవార్డులు దక్కాయని. “హగ్ ఇన్నొవేషన్స్, లూప్ రియాలిటీ, అథ్‌బేస్, కేతి” ఇందులో ఉన్నాయని తెలిపారు.

తెలంగాణ బిడ్డలు ప్రపంచం లో ఎక్కడున్నా గర్వపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కి, కే. టీ. ఆర్ కి కృతఙ్ఞతలు తెలిపారు.

బ్రిస్కీ కంపెనీ వ్యవస్థాపకులు జతిన్ మరియు రాజేష్ లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ప్ కు ఇస్తున్న ప్రాధాన్యత మరియు ప్రత్యేక శ్రద్ధ ఎంతో స్ఫూర్తిగా ఉందని, వారి ఆలోచనను ప్రోత్సహించి ముందుకు నడిపించిన “స్పార్క్ 10 ఆక్సిలేటర్” కు ఎప్పటికి కృతజ్ఞులుగా ఉంటామని తెలిపారు. తెలంగాణ ఐ. టీ. మంత్రి కే. టీ. ఆర్ విజనరీ ఉన్న గొప్ప నాయకుడని వారి ప్రతి నిర్ణయం హైదరాబాద్ పేరును ప్రపంచ పటం లో ప్రత్యేకంగా కనిపించేలా ఉన్నాయని, మేము పూణే లో ప్రారంభించినా ఇప్పుడు హైదరాబాద్ లోనే స్థిరపడి వ్యాపారం ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రపంచ వేదికల్లో మాతృ రాష్ట్రం పేరును ఖ్యాతిని ముందుకు తీసుకెళ్తు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎన్నారై టీ. ఆర్. యస్ శాఖను మరియు టాక్ సంస్థని అభినందించారు. తరువాత ఏర్పాటు చేసిన చర్చలో, పలువురు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పారు.

Success Stories on the Telangana Government startps

టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ, సంస్థ ఆవిర్భవించి తక్కువకాలమే అయినా, మేమంతా తెలంగాణ బ్రాండ్ ని ప్రపంచ వేదికల్లో మార్కెట్ చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని, బంగారు తెలంగాణ నిర్మాణం లో మా వంతు పాత్ర ఉంటుందని, భవిషత్తులో తెలంగాణ రాష్ట్రం నుండి నాయకులని, ప్రభుత్వ ప్రతినిధులని ఆహ్వానించి బిజినెస్ మీట్ లు నిర్వహించి మా వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలిపారు.

చివరిగా ఎగ్జిక్యూటివ్ మెంబెర్ రవి రతినేని వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టీ. ఆర్. యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్నారై టీ. ఆర్. యస్ యుకె – ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి,అశోక్ దూసరి ,శ్రీకాంత్ పెద్దిరాజు ,ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, వీర ప్రవీణ్ కుమార్ సెక్రటరీ శ్రీధర్ రావు తక్కలపెల్లి, సృజన్ రెడ్డి ,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ నవీన్ మాదిరెడ్డి ,ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ నవీన్ భువనగిరి ,వెస్ట్ లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం,సురేష్ బుడగం , ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని మరియు టాక్ సభ్యులు శ్రీ శ్రావ్య, ప్రవళిక ,దీప్తి ,రాజేష్ వాక మరియు స్థానిక ప్రవాసులు ఆర్. సి. రావు, భాస్కర్ నీల తదితరులు హాజరైన వారిలో వున్నారు .

- Advertisement -