టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంను పరామర్శించారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇటీవలే అనారోగ్యానికి గురైన బ్రహ్మానందం సంక్రాంతి పండగ రోజే ఆయనకు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటోన్న బ్రహ్మానందంను కలిశారు బన్నీ. బ్రహ్మి మళ్లీ సినిమాల్లోకి రావాలని.. చురుగ్గా ఉండాలని బన్నీ కోరుకున్నాడు. బ్రహ్మి, బన్నీ కాంబినేషన్లో మంచి సినిమాలు వచ్చాయి. ఈవిషయాన్ని బన్నీ తన ట్వీట్టర్లో షేర్ చేసుకున్నారు. నిజమైన ఉక్కు మనిషి.
ధృడమైన హృదయం కలిగిన వ్యక్తి. వినోదం అందించే ధైర్యమైన వ్యక్తి. మా కిల్ బిల్ పాండేను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందని’ ట్వీట్ చేశాడు బన్నీ. చాలా రోజుల నుంచి ఖళీగా ఉన్న అల్లు అర్జున్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Real Iron Man . Man with a strong heart . Funny & Fearless . Soo happy to see my Kill Bill Pandey killing it .
pic.twitter.com/1bYygm84OL
— Allu Arjun (@alluarjun) February 7, 2019