17 ఏళ్లు పూర్తిచేసుకున్న అల్లు అర్జున్

589
Allu Arjun
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 17 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. 17 ఏళ్ల‌లో బ‌న్నీ 19 సినిమాల్లో హీరోగా చేశాడు. మొద‌ట‌గా ఆయ‌న రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన గంగోత్రి సినిమాలో న‌టించాడు. ఈమూవీ భారీ విజ‌యాన్ని సాధించింది. మొద‌టి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు బ‌న్ని. ఈ సినిమా తరువాత బన్నీ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు.

ప్ర‌తి సినిమాలో త‌న మార్క్ చూపిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా డాన్స్ లలో తనకి తిరుగులేదనే విషయాన్ని నిరూపించడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు. తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకుని స్టైలీష్ స్టార్ అనిపించుకున్నాడు. తెలుగుతో పాటు కేర‌ళ‌లో అల్లు అర్జున్ కు ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ ప్ర‌తి సినిమాను కేర‌ళ‌లో విడుద‌ల చేస్తారు.

అల్లు అర్జున్ చివ‌ర‌గా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అల‌..వైకుంఠ‌పురంలో సినిమాలో న‌టించాడు. ఈమూవీ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఇక బ‌న్ని ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈమూవీలో ర‌ష్మ‌క మంద‌న హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే స‌గం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీని 2021సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు చిత్ర‌యూనిట్.

- Advertisement -