కరీంనగర్…కరోనా అలర్ట్ పై కలెక్టర్ వివరణ

473
collector shashanka
- Advertisement -

కరీంనగర్ కు వచ్చిన 10 మంది ఇండోనేషియా వాసులతో పాటు, మరొకరికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు జిల్లా కలెక్టర్ శశాంక. నగరంలో అమలవుతున్న లాక్ డౌన్ తీరును వాహనాల్లో తిరుగుతూ పరిశీలించిన ఆయన ఇండోనేషియా వాసులతో నేరుగా కాంటాక్టు అయినట్లు అనుమానాలున్న వారిలో పలువురిని క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు.

వీరిలో ప్రస్తుతం చల్మెడ ఆస్పత్రి క్వారంటైన్ లో 49 మంది, శాతవాహన యూనివర్శిటిలో 27 మంది కలిపి మొత్తం 76 మంది ఉన్నారని చెప్పారు. వీళ్లలో ఎవరికీ ఇప్పటి వరకు ఎలాంటి లక్షణాలు లేవని..క్వారంటైన్ లో ఉన్న 76మందితో పాటు మరో 15 మందిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టాం అన్నారు.

హోం క్వారంటైన్ ఉల్లంఘించిన ఐదుగురిని శాతవాహన యూనివర్శిటీకి తరలించామని…శాతవాహనలో కట్టుదిట్టమైన పోలీసుల పర్యవేక్షణ ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో 200 బెడ్లతో ఐసోలేషన్ ఏర్పాటు చేశామని…కొంతమంది శాంపుల్స్ పరీక్షలకు పంపాం. ఇప్పటి వరకు ఎవరిలోనూ పాజిటివ్ రాలేదన్నారు. ఇంకా కొన్ని రిపోర్టులు రావాల్సి ఉందని నెగిటివ్ రిపోర్టులు వచ్చినా సరే 15 రోజులు పూర్తయితే తప్ప ఇంటికి పంపించమని చెప్పారు

ఏవైనా లక్షణాలు కనిపిస్తేనే జిల్లా ఆస్పత్రికి తీసుకువస్తామని….ప్రస్తుతం ఉన్న 15 మందికి కూడా ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు.క్వారంటైన్ లో ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా జిల్లా ఆస్పత్రికి తరలిస్తామని..ప్రొటోకాల్ ప్రకారం 14 రోజులు పూర్తి అయ్యే ముందు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం అన్నారు. క్వారంటైన్ లో ఉన్నప్పుడు వారికి, వారి కుటుంబాలకు కొంత భారంగా ఉన్నా.. అందరి ఆరోగ్యం దృష్ట్యా తప్పడం లేదని..ఇప్పటి వరకు 11 కేసులు మాత్రమే కన్ఫర్మ్ అయ్యాయని చెప్పారు. ఇండోనేషియా వాసుల నుంచి ఒకరికి లోకల్ ట్రాన్స్ మిషన్ వచ్చినందువల్లే కొంత ఏరియాను నిర్భందంలో ఉంచామని…రెడ్ జోన్ లో ఉన్నవారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం అన్నారు.

కొన్ని లోటు పాట్లు ఉన్నా సవరిస్తామని…కూరగాయల మార్కెట్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్టాండ్, వ్యవసాయ మార్కెట్లలో ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే 2-3 వారాలు చాలా కీలకం. అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వ్యాధి విజృంభించే ప్రమాదం ఉందని…సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

- Advertisement -