ఫేస్బుక్ తెచ్చిన తలనొప్పి!

249
Student named on a banner in Kolkata
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాన్ని ఖండిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టినందుకు ఓ విద్యార్థిని కష్టాల్లో పడింది. కొందరు మహిళలు ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్‌తో ఆమె ఇంటి ఎదుట 5 అడుగుల 7 అంగుళాల ఎత్తయిన ఫ్లెక్సీని పెట్టారు. దాని క్రింద ‘‘నీకు సిగ్గుండాలి’’ అని రాశారు. ఫేస్‌బుక్‌లో సరదాగా చేసిన పని ఇంత తలనొప్పి తెస్తుందని ఆమె ఊహించలేదేమో.

ఫేస్‌బుక్‌లో వేదికగా ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. అలాగే మమతా బెనర్జీ నిర్వహించిన దుర్గామాత పరేడ్పై చర్చించింది విధ్యార్థిని రాజశ్రీ ఛటోపాధ్యాయ. నిరుద్యోగ, పేదరిక సమస్యతో బెంగాల్ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రియో ఉత్సవంలో ఎంతో అట్టహాసంగా సీఎం ఆ పరేడ్ నిర్వహించడాన్ని తప్పుడు చర్యగా ఇంజనీరింగ్ చదువుతున్న ఆ అమ్మాయి విమర్శించింది. ఎఫ్బీలో స్నేహితులతో నిర్వహించిన చర్చే విద్యార్థికి పెద్ద తలనొప్పిలా మారింది. విమర్శించిన ఒక్కరోజులోనే ఆదివారం ఆమె ఫోటోతో కూడిన ఓ పెద్ద బ్యానర్ విద్యార్థి నివసించే దమ్ దమ్ ప్రాంతాల్లో వెలసింది. ముఖ్యమంత్రిని విమర్శించడాన్ని తాము ఖండిస్తున్నామంటూ పెద్దపెద్ద అక్షరాలతో బ్యానర్పై లిఖించారు.

facebook

రాజశ్రీ మాట్లాడుతూ ఆదివారం తన ఇంటి వద్ద 5 అడుగుల 7 అంగుళాల ఎత్తయిన ఫేస్‌బుక్ ప్రొఫైల్ పోస్టర్‌ను ఎవరో పెట్టారని తనకు తన పొరుగింటివాళ్ళు ఫోన్ చేసి చెప్పారన్నారు. మొదట్లో తాను నమ్మలేదని, ఆ తర్వాత వాట్సాప్ మెసేజ్ చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం తన ఇంటి వద్దకు కొందరు మహిళలు వచ్చారని, క్షమాపణ చెప్పాలని తనను డిమాండ్ చేశారని తెలిపారు. కానీ తాను క్షమాపణ చెప్పలేదని పేర్కొన్నారు. ఆ మహిళలు స్థానికులేనని, అధికార పార్టీకి చెందినవారని, తాను ఎస్ఎఫ్ఐ మద్దతుదారునని చెప్పారు. తమ ఇరుగుపొరుగువారు తనకు సహాయంగా వచ్చారన్నారు.

వేలమంది ఈ పోస్టర్ను చూస్తారని తాను భయపడటం లేదని, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ మహిళ సభ్యుల వల్ల తనకేమన్న ముప్పు వాటిల్లుతుందేమోనని ఆందోళన చెందుతున్నట్టు ఆ విద్యార్థి పేర్కొంది. దమ్ దమ్ వార్డ్8 సిటిజన్స్ కమిటీ ఈ హోర్డింగ్ పెట్టినట్టు తేలింది. మమతా బెనర్జీని విమర్శించే హక్కు తనకుందని ఆ అమ్మాయి భావిస్తే, తనని బహిరంగంగా నిందించే హక్కు ఇతరులకు ఉంటుందని ఆ పోస్టర్లలో పేర్కోన్నారు.

- Advertisement -