అల్లు అర్జున్‌ సెక్సీయెస్ట్‌ హీరో.. పూనమ్‌ పాండే

895
allu-arjun-sexiest-man-alive-poonam-pandey
allu-arjun-sexiest-man-alive-poonam-pandey
- Advertisement -

బాలీవుడ్‌ సెక్సీ హీరోయిన్ పూనమ్ పాండే పేరు వినగానే యువకులకు చిత్ర విచిత్ర విన్యాసాలు గుర్తుకొస్తాయి. ఏదో ఒక విధంగా వార్తలలోకి ఎక్కాలని, ప్రచారం పొందాలని అనుకునే ఓ ముద్దు గుమ్మ కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ మధ్య ప్రపంచ కప్ గెలుచుకొచ్చిన క్రికెటర్ల కోసం నగ్న ప్రదర్శన చేస్తానని పూనమ్ తెగ గొడవచేసిన విషయం తెలిసిందే. సభ్య సమాజం ఒప్పుకోదు కాబట్టి నగ్న ప్రదర్శన చేయలేదు. లేదంటే ఇండియా క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ గెలిచినప్పుడు పూనమ్‌ పాండే అన్నంత పని చేసి ఉండేది. తన గురించి అప్పట్లో ఎవరికీ అంతగా తెలియదని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని భావించి, ఆ ప్రకటన చేశానని ”న్యూడ్ షో” గుట్టు రట్టు చేసిందీ ముద్దు గుమ్మ.

 poonam-pandey-nude

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ తెలుగు మూవీలో నటించడానికి హైదరాబాద్ వచ్చింది పూనమ్. ఈ సంధర్బంగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ గురించి తన మనసులో మాటను బయట పెట్టింది. అల్లుఅర్జున్ క్యూట్‌గా, సెక్సీయెస్ట్‌గా వుంటాడంటూ చెప్పేసింది. ముఖ్యంగా డ్యాన్స్ బాగా చేస్తాడని అంటూ బన్నీని తెగపొగిడేసింది.

poonam-pandey

పూనమ్ అల్లు అర్జున్‌ను పోగడడంతో బన్నీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తెలుగులో మహేష్‌, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌లాంటి బడా హీరోలున్న తమ బన్నీనే ఎందుకు అలా పొగిడిందని చర్చించుకుంటున్నారు. కాగా, అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాధం సినిమా చేయనున్నాడు.

- Advertisement -