కర్నాటక ఎన్నికల్లో విజయం తరువాత కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో కనబడుతోంది. ఇదే జోష్ ను కొనసాగిస్తూ ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయ ఢంఖా మోగించాలని ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగానే ముందుగా తెలంగాణ టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టి కాంగ్రెస్ గట్టి పట్టుదలగా ఉంది. అయితే గత కొన్నాళ్లుగా టీ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు బాగానే చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పార్టీలోని సీనియర్ నేతలు మరియు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య తారస్థాయిలో విభేదాలు కొనసాగాయి.
కర్నాటక ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించిన తరువాత ఈ విభేదాలు కొంత సద్దుమణిగినట్లు కనిపించిన.. అంతర్గతంగా నివురుగప్పిన నిప్పుల ఉన్నాయనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో ఇటీవల టీ కాంగ్రెస్ నేతలతో హస్తం హైకమాండ్ స్ట్రాటజీ మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ కొంతమంది నేతలను ఉద్దేశించి రాహుల్ గాంధీ గట్టిగానే హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. నేతలందరు విభేదాలను పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పని చేయాలని గట్టిగానే సూచించరాట. పార్టీకి నష్టం చేకూర్చేలా ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ఉపేక్షించేది లేదని కచ్చితంగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ నలుగురి నేతలకు రాహుల్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇంతకీ ఆ నలుగురి నేతలు ఎవరనే చర్చ గట్టిగా జరుగుతోంది.
Also Read: కన్ఫర్మ్.. కాంగ్రెస్ గూటికే !
గతంలో మునుగోడు బైపోల్ టైమ్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనే విధంగా వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వాళ్ళు తరచూ రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇలా కొంతమంది నేతల విభేదాల కారణంగా పార్టీ దెబ్బతినే అవకాశం ఉందని, పార్టీ అంతర్గత విషయాలను ఏమాత్రం బయటపెట్టిన సహించేది లేదని రాహుల్ గాంధీ కాస్త స్ట్రాంగ్ గానే హెచ్చరించారట. దీంతో స్ట్రాటజీ మీటింగ్ లో అధిష్టానం గట్టిగానే తలంటడంతో టీ కాంగ్రెస్ నేతలు ముక్కున వేలేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆ తిలకం మర్చిపోలేను… ఫడ్నవీప్ ఉద్వేగం