పొట్ట ఉబ్బిందా.. ప్రమాదమే!

19
- Advertisement -

చాలమందికి పొట్ట సాధారణ స్థితి కంటే కొంత ముందుకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా పొట్ట ఉబ్బుగా కనిపించడాన్ని చాలమంది తేలికగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అతిగా ఆహారం తిన్నప్పుడు పొట్ట ఎంతో కొంత ఉబ్బుగా కనిపించడం సహజం. కానీ కొంతమంది మితంగా ఆహారం తీసుకున్నప్పటికి కడుపు మాత్రం ఉబ్బుగానే కనిపిస్తుంది. ఇలా ఉన్నవారికి ప్రమాదం పొంచి ఉన్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే పొట్ట ఉబ్బుగా కనిపించడం ‘లివర్ సిర్రోసిస్’ కు కారణం కావొచ్చు. లివర్ సిర్రోసిస్ అనేది కాలేయ సంబంధిత ధీర్ఘకాలిక సమస్య. కాలేయం యొక్క మచ్చ కణజాలాలు క్రమక్రమంగా పెరిగి పొట్ట ఉబ్బుగా కనిపిస్తూ ఉంది. ఇదే సిర్రోసిస్ కు దారి తీస్తుంది. ఈ లివర్ సిర్రోసిస్ సమస్య రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి అతిగా మద్యం సేవించే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వైరల్ హెపటైటిస్ ( బి మరియు సి ) ఉన్నవారు కూడా లివర్ సిర్రోసిస్ బారిన పడే అవకాశం ఉంది.

లివర్ సిర్రోసిస్ లక్షణాలు

ఈ సమస్య ఉన్నవారిలో ముఖ్యంగా పొట్ట ఉబ్బుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలసట, ఏ పని చేయలేకపోవడం, బలహీనత, బద్దకం, ఆకలి మందగించడం, కాళ్లలో వాపు, వికారం, పురుషుల్లో వృషణాల క్షీణత, చర్మంపై దురద, వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ లక్షణాలు ఏ మాత్రం కనిపించిన ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఎంతో మేలు.

చాలమంది అధిక బరువు వల్ల మాత్రమే పొట్ట ఉబ్బుగా కనిపిస్తుందనే అపోహలో ఉంటారు. కానీ ఈ రకమైన కాలేయ సమస్యల ద్వారా కూడా పొట్ట ఉబ్బుగానే ఉంటుంది. కాబట్టి ఈ సమస్య విషయంలో ఆజాగ్రత్త సరికాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:పీకే రిపోర్ట్ : వైసీపీకి డేంజర్ బెల్స్!

- Advertisement -