సల్మాన్ ఫ్యాన్స్‎వి.. 12 ఫోన్లు కొట్టేశాడు

239
stealing phones outside Salman Khan's home
- Advertisement -

కృష్ణజింకల వేటాడిన కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్ బెయిల్‎పై బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో బెయిల్ పై బయటికి వచ్చిండన్న సంతోషంలో సంబరాలు చేసుకుంటుంటే ఓ యువకుడి మాత్రం అదే తనకు అదునుగా మలుచుకున్నాడు. రద్దీ ఉండడం చూసి ప్లాన్ ప్రకారం ఒక్కటి తరువాత ఒక్కటి ఏకంగా 12 ఫోన్లు కొట్టేసి అక్కడి నుంచి పారిపోయాడు. అందరు తొక్కిసలాటలో పోయిందనుకుని వదిలేసారు.

కానీ ఫోన్ పోయిన వారిలో అథర్ అస్లమ్ ఖాన్ అనే వ్యక్తి బాంద్రా పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేయడంలో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు విశాల్ యాదవ్(19) గా గుర్తించారు. విశాల్ యాదవ్ నుంచి 2 ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపర్చి పోలీస్ కస్టడీకి తరలంచారు.

- Advertisement -