కరోనా మరణాలపై డెత్ ఆడిట్..!

109
guleria
- Advertisement -

దేశంలో సంభవించిన కరోనా మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలని కోరారు ఎయిమ్స్‌డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా. ఒక వ్యక్తికి అప్పటికే కరోనా ఉండి గుండెపోటుతో చనిపోతే అప్పుడు కోవిడ్ గుండెపోటుకు కారణం కావచ్చు. మీరు దీనిని కోవిడ్ మరణమని లేదా నాన్‌ కోవిడ్‌గా గుర్తించి గుండెపోటుతో మరణించారని అని తప్పుగా వర్గీకరించవచ్చు. కాబట్టి, అన్ని ఆస్పత్రులు, రాష్ట్రాలు డెత్ ఆడిట్ చేయవలసిన అవసరం ఉందన్నారు.

స్పష్టమైన డేటా లేకపోతే,కరోనాను అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎలా సిద్దం చేయగలుగుతామని తెలిపారు. కోవిడ్‌ మరణాల లెక్కింపు విషయంలో రాష్ట్రాలు, ప్రభుత్వాల మధ్య ఏర్పడిన వ్యత్సాసం వల్ల కోవిడ్‌కు వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గులేరియా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

- Advertisement -