ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్..సిట్సిపాస్‌తో జకోవిచ్

91
novak

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ పోరు నేడు జరగనుంది. ఎర్రమట్టి కోర్టు రారాజు రఫెల్ నాదల్‌ను ఓడించి జకోవిచ్ ఫైనల్‌కు చేరుకోగా తుదిపోరులో సిట్సిపాస్‌తో తలపడనున్నాడు జకోవిచ్. సాయంత్రం గం. 6:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్‌ 5–2తో సిట్సి పాస్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. గత ఏడాది ఈ టోర్నీ సెమీఫైనల్లో ఐదు సెట్‌ల పోరాటంలో సిట్సిపాస్‌పై జొకోవిచ్‌ గెలిచాడు.

సెమిఫైనల్లో నాదల్‌తో తలపడ్డ జకోవిచ్..అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 టైటిల్స్‌… 105 విజయాలు… కేవలం 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి పాలైన నాదల్‌ను మట్టికరిపించాడు జకోవిచ్.

4 గంటల 11 నిమిషాల పాటు సాగిన పోరులో జొకోవిచ్‌ (సెర్బియా) 3–6,6–3, 7–6 (7/4), 6–2తో మూడో సీడ్‌ నాదల్‌ను బోల్తా కొట్టించాడు. గత ఏడాది ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్‌ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నాడు.