వీధి కుక్కల దాడులు..కలెక్టర్లకు నోటీసులు!

7
- Advertisement -

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న వీధి కుక్కల దాడులపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) తీవ్రంగా స్పందించింది. అమాయక ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగం కల్పించిన “జీవించే హక్కు” (Right to Life) ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించింది.

ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలను ఎస్‌హెచ్ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ డా. షమీమ్ అక్తర్ సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టారు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో మూడేళ్ల చిన్నారిని వీధి కుక్కలు పొలాల్లోకి లాక్కెళ్లి అత్యంత దారుణంగా పీక్కతిన్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

భువనగిరి ఘటన: భువనగిరి జిల్లాలో ర్యాకం నాగరాజు (36) అనే వ్యక్తి వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘోర కలికాలంపై సంబంధిత జిల్లాల యంత్రాంగం నుంచి కమిషన్ వివరణ కోరింది.పెద్దపల్లి మరియు భువనగిరి జిల్లాల కలెక్టర్లు ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, జూన్ 2వ తేదీ లోపు పూర్తి స్థాయి నివేదికను కమిషన్‌కు అందజేయాలని ఆదేశించింది.

వీధి కుక్కల నియంత్రణలో స్థానిక సంస్థలు మరియు అధికార యంత్రాంగం వైఫల్యంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది.చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎవరూ వీధుల్లో తిరగలేని పరిస్థితి నెలకొందని, మున్సిపల్ శాఖ మరియు పంచాయతీ రాజ్ శాఖలు తక్షణమే చర్యలు చేపట్టాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవడంతోనైనా క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందని సామాన్యులు ఆశిస్తున్నారు.

ALso Read:పిల్లలకు మాటలు ఆలస్యమవ్వడం ఆటిజమా?

- Advertisement -