పచ్చదనంతో ఆరోగ్యం:సంతోష్ కుమార్

4
- Advertisement -

ఎర్త్ డే సందర్భంగా భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, మనం ఈరోజు తీసుకునే నిర్ణయాలే రేపటి ప్రపంచాన్ని నిర్మిస్తాయని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి ప్రేరణగా, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.

ప్రకృతి మనకు అన్నింటినీ అందించిందని, ఇప్పుడు మనం కూడా ప్రకృతికి తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. చెట్లు నాటడం, వ్యర్థాలను తగ్గించడం, నీటిని సంరక్షించడం వంటి చిన్నచిన్న చర్యలతోనే పెద్ద మార్పు సాధ్యమవుతుందని అన్నారు.

ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని, కలిసి పచ్చదనం నిండిన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకుందామని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.

Also Read:

 

- Advertisement -