రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు.. జూన్3 రైతు దినోత్సవం

135
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రోజున రైతు దినోత్సవం జరుపుకుంటారు. దానికి వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని పల్లె పల్లెకు వివరిస్తారు. ఇందుకోసం రైతు వేదికలను ఉపయోగించుకొనున్నారు.

Also Read: అ రికార్డ్ కే‌సి‌ఆర్ కే సొంతం !

రైతు బంధు, రైతు భీమా, ఎరువుల పంపిణీ, సబ్సీడి యంత్రాలు, సబ్సీడి విత్తనాలు లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను రైతులకు వ్యవసాయ శాఖ వివరించనుంది. రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ విత్తన నాణ్యతపై ప్రత్యేక పాటను రూపొందించింది. వ్యవసాయంలో రైతులకు అధిక లాభాలను తేవడంలో విత్తన నాణ్యమైన విత్తనాల పాత్ర ఏంటి అని పాటలో పొందుపరిచారు. శనివారం వ్యవసాయ శాఖ ఉత్సవాల్లో భాగంగా ఈ పాటను ప్రదర్శించనున్నారు.

Also Read: ” హనుమాసనం “తో అంగస్తంభన దూరం !

- Advertisement -