మొక్కలు నాటిన… సివిల్ సప్లై చైర్మన్ సర్దార్‌

370
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ స్థాపించబడిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. దినదినాభివృద్ది చెందుతూ దేశంలోని ప్రముఖులును మొక్కలను నాటే విధంగా ప్రేరణ కల్పిస్తోంది.  కరీంనగర్‌ జిల్లాలోని బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యత చేపట్టిన సందర్బంగా సర్దార్‌ రవీందర్ సింగ్‌ స్థానిక తారక హోటల్ దగ్గర మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సర్దార్ మాట్లాడుతూ… భారత దేశం లోనే హరితహారం కి అత్యధిక నిధులు కేటాయిస్తున్నది కేవలం తెలంగాణ రాష్ట్రమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి మొక్కల పెంపకంపైనా మక్కువ ఎక్కువని… దీనికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం భారత దేశమంతటా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక కార్యకర్తలు , మీడియా మిత్రులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

రెండోదశ మెట్రోకు శంకుస్థాపన

పవన్ కళ్యాణ్ కు వారాహి చిక్కులు…

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి కుమారస్వామి

- Advertisement -