లవర్ కోసం నిర్మాతగా మారిన నయనతార..

615
Nayanthara
- Advertisement -

అందాల నటి నయనతార తన ప్రియుడి కోసం నిర్మాతగా మారనుంది. లేడి ఓరియెంటెడ్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నాడు. అయితే నయనతార, విఘ్నేష్ శివన్ గత కొంతకాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ జంట ఒక్కటి కాబోతున్నారని కూడా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Nayanthara-Vignesh Shivan

ఈ పుకార్లపై మాత్రం ఇటు నయనతార కానీ, అటు విఘ్నేష్ శివన్ స్పందించలేదు. వీళ్లు విదేశాల్లో కలిసి షాపింగ్ చేస్తున్న ఫోటోలను పోస్టు చేస్తూ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చారు. ఇక తాజాగా  విఘ్నేష్ శివన్, నయనతారకు లేడిఓరియెంటెడ్ కథను వినిపించగా.. నటించడానికి… ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిందని సమాచారం. ప్రియుడిపై ఉన్న ప్రేమతోనే ఈ సినిమాను నిర్మించడానికి ఒప్పుకుందని కోలీవుడ్ ప్రేక్షకులు అనుకుంటున్నారట.

కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అనగానే గుర్తుకు వచ్చేది నయనతార మాత్రమే. ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు లవర్ కోసం నిర్మాతగా మారిన నయనతారకు ఈ సినిమా మంచి వసూళ్లు తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాలి ఇక.

- Advertisement -