జూలైలో మెట్రో ఫేజ్‌-2 ప్రారంభం:కేటీఆర్

213
ktr metro

గ్రేటర్‌ పరిధిలో మెట్రోను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమీర్‌పేట-ఎల్బీ నగర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా మెట్రోలో మంత్రులు కేటీఆర్,మహేందర్ రెడ్డి ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ నాగోల్‌-మియాపూర్‌ రూట్‌లో
రోజుకు 80 వేల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు.

మెట్రో స్టేషన్ల పరిధిలో ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా ఆర్టీసీ చర్యలు చేపడుతుందన్నారు. దీంతో పాటు త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. మియాపూర్‌ స్టేషన్‌లో ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌ మెట్రోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మెట్రో నిర్మాణం చేపట్టామన్నారు.

జులై చివరి నాటికి మెట్రో రెండో దశ పూర్తవుతుందన్నారు. నాంపల్లి రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్‌ను మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో 45 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. అక్టోబర్ నెలలోనే హైటెక్ సిటీ – అమీర్ పేట అందుబాటులోకి వస్తుందన్నారు. మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు.