స్టార్ డైరెక్ట‌ర్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

348
vijay sukumar
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి సినిమాతో మాస్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన గీత గోవిందం సినిమాతో క్లాస్ ప్రేక్ష‌కుల‌ను సంపాదించుకున్నాడు. విజ‌య్ యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పర‌చుకున్నాడు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ ట్యాక్సివాలా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. సినిమా సినిమాకు విజ‌య్ క్రేజ్ పెర‌గుతుండ‌టంతో విజ‌య్ పై ఓ స్టార్ డైరక్ట‌ర్ క‌న్ను వేశాడ‌ని ఫ‌లీం న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

vijay devarakonda

ఆ టాప్ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు రీసెంట్ గా రంగ‌స్ధ‌లం సినిమాతో భారీ హీట్ కొట్టిన సుకుమార్. విజ‌య్ తో సినిమా చేసేందుకు స‌కుమార్ ఆస‌క్తి చూపుతున్నాడ‌ని స‌మాచారం. త‌న వ‌ద్ద ఉన్న‌ తెలంగాణ భాష నేప‌థ్యంలో ఉన్న స్టోరీ విజ‌య్ కి బాగా సూట‌వుతుంద‌ని భావిస్తున్నాడట సుకుమార్. ఈ మ‌ధ్యే విజ‌య్ కి క‌థ కుడా వినిపించాడ‌ని తెలుస్తుంది. స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రైన సుకుమార్ విజ‌య్ తో సినిమా చేస్తే అత‌ని క్రేజ్ మ‌రింత పెర‌గ‌నుందంటున్నారు సినీ వ‌ర్గాలు.

- Advertisement -