ఇలియాన తొలిసారి తెలుగులో..

230
iliyanaa
- Advertisement -

ఇలియాన చాలా రోజులు తర్వాత తెలుగు లో హీరోయిన్ గా న‌టిస్తుంది. ప్రస్తుతం శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ స‌ర‌స‌న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమా చేస్తోంది. ఈమూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. న‌వంబ‌ర్ 16వ తేదిన ఈచిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. ఇలియాన గ‌తంలో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి అగ్ర క‌థ‌నాయిక‌గా వెలుగొందింది.

amar akber antoni iliyana

తెలుగులో మంచి విజ‌యాలు రావ‌డంతో అమ్మ‌డుకు బాలీవుడ్ నుంచి కూడా బాగా అవ‌కాశాలు వ‌చ్చాయి. దీంతో తెలుగులో సినిమాలు మానేసి బాలీవుడ్ కు వెళ్లింది. అక్క‌డ ఆమె న‌టించిన సినిమాలు పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో ఆమె మ‌ళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

Ileana

తాజాగా తాను న‌టించిన సినిమా కోసం పెద్ద సాహాస‌మే చేసింది ఇలియాన. తొలిసారిగా తెలుగులో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో ఇలియానా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. త‌న లైఫ్ లో త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఈసినిమా అటు ఇలియాన‌కు ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల‌కు ఛాలెంజ్ గా మారింది. వ‌రుస సినిమాల‌తో విఫ‌ల‌మ‌వుతున్న శ్రీనువైట్ల‌కు ఈమూవీ ఎంత మేర‌కు విజ‌యం సాధిస్తుందో చూడాలి.

- Advertisement -