#ssmb29 ముహూర్తం ఎప్పుడంటే?

26
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి తీయబోతున్న సినిమాకు సంబందించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం స్క్రిప్టింగ్ స్టేజీలో ఉన్న ఈ సినిమా మార్చ్ లో గ్రాండ్ గా లాంచ్ కానుందని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి మహేష్ ప్రాజెక్ట్ కు ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో ఓ ఎడ్వంచర్ స్టోరీ రెడీ చేసే పనిలో ఉన్నాడు.

మహేష్ కూడా త్రివిక్రమ్ సినిమాతో షూటింగ్ లో ఉన్నాడు. సారధీ స్టూడియోస్ లో హౌజ్ సెట్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. మహేష్ తో పాటు మిగతా నటీ నటులు కూడా పాల్గొంటున్నారు. వీలైనంత ఫాస్ట్ గా మహేష్ త్రివిక్రం సినిమాను కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు. మార్చ్ లో ముహూర్తం చేసి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుండి రెగ్యులర్ ఘాట్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు రాజమౌలి. ఈ లోపు మహేష్ త్రివిక్రమ్ సినిమాను ఫినిష్ చేయాల్సి ఉంది.

దుర్గా ఆర్ట్స్ బేనర్ పై కె ఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారు. మహేష్ సరసన దీపికా పడుకొనే ను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -