టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు మరియు లెజెండరీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కలసి చేస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం SSMB29(వర్కింగ్ టైటిల్) భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ అయినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తికాగా చిన్న విరామం దొరకడంతో ప్రియాంకా చోప్రా అమెరికాకు వెళ్లగా, రాజమౌళి తన డాక్యుమెంటరీ RRR: Behind and Beyond ప్రచారం కోసం జపాన్‌కు వెళ్లారు.
మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి రోమ్‌లో విలాసవంతమైన సెలవులు గడిపారు. విమానాశ్రయంలో మహేష్ బాబు తన పాస్‌పోర్ట్ చూపించిన ఓ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక వెకేషన్ పూర్తి చేసుకున్న మహేష్.. హైదరాబాద్‌కి తిరిగి వచ్చారు. తిరిగి ఎస్‌ఎస్‌ఎంబీ షూటింగ్‌లో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉండగా నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Also Read:TTD:ముగిసిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు