SSMB28: టైటిల్ సమస్య!

36
- Advertisement -

మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబో సినిమా ఎనౌన్స్ మెంట్ నుండే ఫ్యాన్స్ కి అప్ డేట్స్ అందుతున్నాయి. అయితే ఈ మధ్య మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా సూపర్ ఫ్యాన్స్ ను వెయిట్ చేయించారు. ఉగాది రోజు ఫస్ట్ లుక్ ఉంటుందని ఆశించిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. అయితే ఎక్కువ ఆలస్యం చేయకుండా ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం చూడలేక రెండ్రోజులకే రిలీజ్ డేట్ తో ఓ పోస్టర్ వదిలి వారిని కూల్ చేశారు.

అయితే టైటిల్ చెప్పకుండా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ బాగునప్పటికీ అందులో టైటిల్ లేదేంటనే డిస్కషనే ఎక్కువగా నడిచింది. మేకర్స్ ఇన్ని నెలలు ఫ్యాన్స్ ను వెయిట్ చేయించింది కూడా టైటిల్ కోసమే. సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ‘అమరావతి కి అటు ఇటు’ , ‘గుంటూరు కారం’ అనే రెండు టైటిల్స్ లిస్ట్ అవుట్ చేశారు కానీ వాటిలో ఇప్పుడు ఏది పెట్టేందుకు సిద్దంగా లేరు. కాకపోతే ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చూస్తుండలేక టైటిల్ లేకుండానే రిలీజ్ పోస్టర్ వదిలారు. ఇక్కడ ఇంకో మేటర్ కూడా ఉంది. రామ్ చరణ్ , శంకర్ లతో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా రిలీజ్ డేట్ వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఒకరోజు ముందే సంక్రాంతి రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేసేశారు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు ఎప్పుడూ టైటిల్ తో ఇబ్బందే. షూటింగ్ మొదలు పెట్టేసి ఆ తర్వాత టైటిల్ అనుకొని లీక్ చేయడం త్రివిక్రమ్ నైజాం. ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా అదే జరుగుతుంది. కానీ ఈసారి లీకైన టైటిల్స్ కాకుండా ఇంకొకటి ఏదో పెట్టాలని భావిస్తున్నారు. ఫైనల్ గా మహేష్ , త్రివిక్రమ్ ఓ మాస్ టైటిల్ కే ఓటేసె అవకాశం ఉంది. మహేష్ బర్త్ డే సందర్భంలో మే నెలలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -