నెగటివ్ వచ్చినా క్వారంటైన్‌లోనే..!

175
assam
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్ధాయిలో కేసులు నమోదవుతుండగా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ బాటపట్టాయి. ఇందులో భాగంగా అంతరాష్ట్ర రాకపోకలపై కఠిన నిబంధనలు విధించాయి.

ఇక అసోంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉన్నప్పటికీ బయటి రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. ఆరోగ్య కారణాల రీత్యా ప్రయాణాలు చేసే ప్రభుత్వ అధికారులు, మరణాలకు సంబంధించి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు దీనిని నుంచి మినహాయింపు ఉంటుందని ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ సర్మ తెలిపారు.

అసొంలో ప్రస్తుతం 9048 యాక్టివ్ కేసులుండగా 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -