దంచికొట్టిన చెన్నై…

51
csk

ఐపీఎల్ 14వ సీజన్‌లో చెన్నై అదరిపోయే ఆటతీరుతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో గెలుపొంది సత్తాచాటింది.

చెన్నై విధించిన 221 పరుగల లక్ష్య చేధనలో 19.1 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది. పాట్‌ కమిన్స్‌(66 నాటౌట్‌: 34 బంతుల్లో 4ఫోర్లు, 6సిక్సర్లు), ఆండ్రీ రస్సెల్‌(54: 22 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సర్లు), దినేశ్‌ కార్తీక్‌(40: 24 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) పోరాటం వృథా అయింది.

అంతకుముందు డుప్లెసిస్‌(95 నాటౌట్‌: 60 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌(64: 42 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లు ) విరవిహారం చేయడంతో 20 ఓవర్లలో చెన్నై 3 వికెట్లకు 220 పరుగులు చేసింది.