యాక్షన్‌ ఎడ్వెంచర్‌గా మహేష్- రాజమౌళి సినిమా..!

169
mahesh
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ కమిట్ అయిన సినిమాలు పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సినిమాకు విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తుండ‌గా, ఇప్ప‌టికే ఆ ప‌ని మొద‌లు పెట్టేశార‌ట‌. ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఫారెస్ట్‌లో జరిగే యాక్షన్‌ ఎడ్వెంచరెస్‌ మూవీగా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నుండ‌గా, ఈ సినిమాని ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌లో చిత్రీక‌రించ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఇండియన్ సినిమాలో ఇంత వ‌ర‌కు చూడ‌ని విజువ‌ల్స్ రాజ‌మౌళి-మ‌హేష్ బాబు సినిమాలో క‌నిపించ‌నున్నాయ‌ట‌. ఇదిలావుండగా ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. మరోవైపు మహేశ్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.

- Advertisement -