టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా విజయ లక్ష్మి..

118
Gadwala Vijaya Lakshmi
- Advertisement -

హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పోటీ పడుతుండగా, అభ్యర్థులు ఎవరనేది మరికాసేపట్లో తేలిపోనుంది. టీఆర్ఎస్ నుంచి పోటీపడే అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించి సీల్డ్ కవర్‌లో దానిని మంత్రులకు అందించారు. కేసీఆర్ ఎంపిక చేసిన వారిలో మేయర్‌గా టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుమార్తె గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత ఉన్నట్టు సమాచారం.

ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. గత ఎన్నికల సమయంలోనే ఆమె మేయర్ పీఠం కోసం కూడా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఈసారి మాత్రం ఆమెకు పక్కా అని చెబుతున్నారు. శ్రీలత తార్నాక నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

- Advertisement -