జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఎన్నిక‌..

176
GHMC mayor
- Advertisement -

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఎన్నిక‌య్యారు. నూత‌నంగా ఎన్నికైన మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మికి టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్ష‌లు తెలిపారు. మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి పేరును కార్పొరేటర్ బాబాఫ‌సీయుద్దీన్‌, గాజుల‌రామారం కార్పొరేట‌ర్ ప్ర‌తిపాదించారు.

విజ‌య‌ల‌క్ష్మి 2016లో బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ డివిజన్ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. గత ఎన్నికల సమయంలోనే ఆమె మేయర్ పీఠం కోసం కూడా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈసారి మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు.

మేయ‌ర్ ప్రొఫైల్ :
గద్వాల విజయలక్ష్మి(బంజారాహిల్స్‌)
వయస్సు: 56
భర్త: బాబీరెడ్డి
విద్యార్హత: ఎల్‌ఎల్‌బీ
కులం: మున్నూరు కాపు (బీసీ)

- Advertisement -