యస్ యస్ రాజమౌళి ‘బాహుబలి ది బిగినింగ్’తో సంచలనం సృష్టించాడు.ఈ సినిమా దాదాపు రూ. 600 కోట్ల వసూళ్లు సాధించి భారతీయ చలనచిత్ర పరిశ్రమ దృష్టి టాలీవుడ్‌పై పడేలా చేసింది. దక్షిణాదిన అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇప్పటికీ ‘బాహుబలి’నే. ఇప్పుడు ‘బాహుబలి ది కన్‌క్లూజన్’పైనా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి.దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబలి 2’ ట్రైలర్ ఈమధ్యే విడుదలై ఎన్నో రికార్డులకు వేదికగా మారింది. ‘బాహుబలి-2’ విడుదలకు ముందే మరో రికార్డు సాధించింది. ఇప్పటికే ఆన్లైన్లో అత్యధికమంది వీక్షించిన ట్రైలర్‌గా ‘బాహుబలి-2’ రికార్డు సృష్టించగా.. ఇప్పుడు అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రంగా ఘనతను సొంతం చేసుకోబోతున్నది. దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. దేశంలో ఇంతటి సంఖ్యలో థియేటర్లలో ఓ సినిమా విడుదల కావడం ఇదే ప్రథమం. ‘భారత్‌లో ‘బాహుబలి-2′ 6500 థియేటర్లలో విడుదల కానుంది. భారత్‌లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మొదటి సినిమా ఇదే’ అని ట్రేడ్ అనాలిస్ట్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు.
తొలి 24 గంటల్లో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో 5 కోట్ల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 100 మిలియన్లకుపైగా వ్యూస్‌ను సాధించి దూసుకుపోతున్నది.అత్యధిక వీక్షణలు పొందిన చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచింది. ఒక ట్రైలర్ ఇంతటి రెస్పాన్స్ సాధించడం భారత చిత్రపరిశ్రమలో ఇదే తొలిసారి.అయితే లైకుల విషయంలో బాహుబలిదే రికార్డు అంటున్నారు. పాపులర్ సాంగ్స్ మాత్రమే యూట్యూబ్‌లో ఈ స్థాయిలో వ్యూస్ సాధించాయి.మరి ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో విడుదలవుతున్నఈ సినిమా హౌస్‌ఫుల్ అయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 25న ఆడియో ఫంక్షన్ నిర్వహించనున్నారు.