నయన్‌ డోరా ఫ్యామిలీ టైపు కాదా..?

168
nayantharas-dora-gets

నయనతార మెయిన్‌ లీడ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్‌ హర్రర్‌ నేపథ్య చిత్రం ”డోరా”. ఈ సినిమాను మార్చి 31న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విషయంలో సెన్సార్ బోర్డు మాత్రం షాకిచ్చింది.

సెన్సార్ బోర్డు ‘డోరా’కు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో చిత్ర యూనిట్‌ దిగ్ర్భాంతికి గురైంది. హితేష్‌ జబక్‌, దర్శకుడు సర్గుణం సంయుక్త నిర్మాణంలో యువ దర్శకుడు దాస్‌ రామస్వామి తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్ల తరువాత అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి.

dora-759

ఇక హీరోయిన్ ఓరియెంటెడ్‌ చిత్రమని మొదటి నుంచి ప్రచారం జరుగుతుండడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే 31వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ‘డోరా’కి సెన్సార్‌ బోర్డు ఏ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో అంతా తారుమారైంది. సినిమాలో హర్రర్‌ కంటెంట్‌ అధికంగా ఉన్నందువల్లే ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీతో ఈ సినిమా చూడాలంటే కొంతమేరకు ఇబ్బంది ఉండటం వల్లే సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని వారు తెలిపారు. అందుకే సినిమాలోని ఆ సీన్లలో వయలెన్స్ పాళ్ళు తగ్గించి.. సినిమాను రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారు. కాగా, యు/ఏ సర్టిఫికెట్‌ కోసం ‘డోరా’ చిత్ర బృందం రివైజింగ్‌ కమిటీకి వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.