మేళ్ళ చెరువులో వైభ‌వంగా వెంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం

361
errabelli
- Advertisement -

సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువులోని మై హోమ్స్ సంస్థ మ‌హా సిమెంట్స్ ఆవ‌ర‌ణ‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. అతిథులు, అనేక మంది ఆహ్వానితులు, భ‌క్తుల మ‌ధ్య చిన్న జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో క‌న్నుల పండుగ‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఆయ‌న స‌తీమ‌ణి ఉషా ద‌యాక‌ర్ రావులు హాజ‌ర‌య్యారు.

మై హోమ్స్ జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు-సుకుమార్ దంప‌తులు స్వామివార్ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛార‌ణ‌ల మ‌ధ్య స్వామి వారి క‌ళ్యాణం జ‌రిగింది. క‌ళ్యాణం అనంత‌రం చిన్న జీయ‌ర్ స్వామి మంత్రి ఎర్ర‌బెల్లి దంప‌తులు, రామేశ్వ‌ర‌రావు దంప‌తులు స‌హా, భ‌క్తులంద‌రికీ ఆశ్వీర‌చ‌నాలు అందించారు. అలాగే, జీయ‌ర్ ట్ర‌స్ట్ రూపొందించిన శ్రీ‌శార్వ‌రి నామ సంవ‌త్స‌ర ఉగాది పంచాంగాన్ని మంత్రి-జీయ‌ర్ స్వామి, రామేశ్వ‌ర‌రావులు క‌లిసి ఆవిష్క‌రించారు.

అనంత‌రం రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ళ్యాణానికి తాను క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తి ఏడాదీ వ‌స్తున్నామ‌న్నారు. 23 ఏళ్ళుగా ఈ క‌ళ్యాణోత్స‌వం జ‌రుగుతున్న‌ద‌ని చెప్పారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి కృపాక‌టాక్షాలు ప్ర‌జ‌ల‌పై ఉండాల‌ని, రాష్ట్రం సుఖ శాంతుల‌తో స‌భిక్షంగా ఉండాల‌ని ఆకాంక్షించారు. అనంత‌రం స్వామి వారితోపాటు, చిన్న జీయ‌ర్ స్వామిల‌కు సాష్టాంగ ప్ర‌ణామాలు చేశార‌. ఆ త‌ర్వాత భ‌క్తులంద‌రికీ తీర్థ ప్ర‌సాదాలు అందించారు. భోజ‌నాలు వ‌డ్డించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే చంద‌ర్ రావు, మై హోం ఇండ‌స్ట్రీస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, చుట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అనేక మంది పాల్గొన్నారు.

- Advertisement -