‘పుష్ప’ నుంచి ‘శ్రీ‌వ‌ల్లి’ సాంగ్‌ విడుదల..

28

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పుష్ప‌’.ఈ సినిమాలో రష్మిక మందన్నా శ్రీ‌వ‌ల్లిగా నటిస్తోన్న విష‌యం తెలిసిందే. ‘అయితే తాజాగా ఈ సినిమా నుంచి శ్రీ‌వ‌ల్లి పాటను విడుద‌ల చేశారు. చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే.. చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. న‌వ్వే న‌వ‌ర‌త్న‌మాయెనే’ అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ అల‌రిస్తున్నాయి. ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ శ్రీరామ్ ఆలపించగా.. హిందీలో జావేద్ అలి పాడారు. పాట శ్రోత‌ల‌ని తెగ ఆక‌ట్టుకుంటుంది. రానున్న రోజుల‌లో ఈ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని అంటున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘పుష్ప ది రైస్’ డిసెంబర్ 17న 5 భాషలలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ‘పుష్ప రాజ్’, రష్మికల ‘శ్రీవల్లి’ లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవల వచ్చిన ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో అక్టోబర్ 13న ఈ మూవీ నుంచి ‘చూపె బంగారమాయేనే శ్రీవల్లి’.. అంటూ సాగే లిరికల్ సాగ్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్ ప్రోమోను ఈరోజు వదిలారు. మైత్రి మూవీ మేకర్స్ మొత్తంశెట్టి మీడియా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

#Srivalli (Telugu) | Pushpa - The Rise | Allu Arjun, Rashmika | DSP | Sid Sriram | Sukumar