‘రాధే శ్యామ్’.. పూజ హెగ్డే స్పెషల్ పోస్టర్..

100
Pooja Hegde Birthday Poster
- Advertisement -

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధే శ్యామ్’. తాజాగా ఈ మూవీ నుంచి పూజా హెగ్డే కొత్త పోస్టర్ రిలీజైంది. టి-సిరీస్, యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. విదేశీ నేపథ్యంలో.. పునర్జన్మల చుట్టూ అల్లుకున్న ఈ కథను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

కాగా ఈ రోజున పూజ హెగ్డే పుట్టినరోజు కావడంతో, ఆమెకి విషెస్ తెలియజేస్తూ.. అదే విధంగా ఆమె పాత్ర పేరు ‘ప్రేరణ’ను మరోసారి గుర్తుచేస్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పూజ గ్రాండియర్ లుక్‌తో కనిపిస్తోంది. ఆమె నాజూకుతనాన్ని ఈ పోస్టర్ అందంగా ఆవిష్కరించింది. ప్రేరణ పాత్ర తన కెరియర్లోనే ప్రత్యేకమైనదని పూజ చెబుతుండటం విశేషం. ఇక మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు.

- Advertisement -