నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు..

19
Huzurabad bypoll

హుజురాబాద్‌లో నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుంది. ఈ క్రమంలో అభ్యర్థులు ఇటీవల నామినేషన్లు వేశారు. తాజాగా అధికారులు వాటి పరిశీలన చేపట్టారు. 61 నామినేషన్లలో 19 తిరస్కరించారు. ఉప ఎన్నిక బరిలో ప్రస్తుతం 42 మంది అభ్యర్థులు ఉన్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది.

దీంతో ఈ రోజు ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. ఇక నామినేషన్ల ఘట్టంలో కీలకమైన గుర్తుల కేటాయింపుల ప్రక్రియ కూడా నేడు సాయంత్రం జరగనుంది.ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపి నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ తరఫున బల్మూరి వెంకట్ పోటీలో ఉన్నారు.