- Advertisement -
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది.ఎగువ నుండి 97 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో ఓ గేటును ఎత్తి స్పిల్ వే ద్వారా దిగువ నాగార్జున సాగర్‌కు 27 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం పూర్తిగా నిండింది. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 587.7 అడుగులు (306.14) టీఎంసీల నీరుంది.
కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఎడమ కాల్వ, జల విద్యుత్ కేంద్రం, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 25 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
- Advertisement -