24 గంటల్లో 2574 కరోనా కేసులు…

122
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 41 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,574 పాజిటివ్ కేసులు నమోదుకాగా 9 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,969కి చేరగా 76.2% మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనా మహమ్మారితో ఇప్పటివరకు 886 మంది మృతిచెందగా ప్రస్తుతం రాష్ట్రంలో 32,553 యాక్టివ్ కేసులున్నాయి.

మరణాల రేటు దేశవ్యాప్తంగా 1.71% ఉంటే.. తెలంగాణలో0.62% ఉందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.