శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం..

214
srisailam
- Advertisement -

శ్రీశైలం ఎడమగట్టు కాలువ భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి 10.30 గంటలకు ఒక్కసారిగా విద్యుత్ కేంద్రంలో పొగలు అలుముకోవడంతో వెంటనే స్పందించిన అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. 9 మంది సిబ్బంది మంటల్లో చిక్కుకుపోవడంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది శ్రమిస్తోంది.

ప్రమాద విషయాన్ని తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. భారీగా పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని …తీవ్రమైన పొగ కారణంగా ఆక్సిజన్‌ పెట్టుకున్నా ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నారని మంత్రి తెలిపారు. అవసరమైతే సింగరేణి సిబ్బంది సాయం తీసుకుంటామని వెల్లడించారు.

పవర్ ప్లాంట్ లోపల డీఈ శ్రీనివాస్, ఏఈలు సుందర్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్రావు, మోహన్‌తో పాటు ఆమ్రాన్‌ కంపెనీకి చెందిన రాంబాబు, కిరణ్ లోపలే ఉండిపోయారు.

- Advertisement -