విత్తన గణపతిని పూజించండి: ఎంపీ సంతోష్

96
santhosh kumar

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన వస్తోంది. ఇప్పటికే సినీ,క్రీడా,రాజకీయాలకు అతీతంగా గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొంటుండగా ఈ కార్యక్రమంలో భాగంగా విత్తన గణపతి కార్యక్రమాన్ని సంతోష్ కుమార్ ముందుకు తీసుకొచ్చారు.

ఎకో ఫ్రెండ్లీ గణేశాలో భాగంగా విత్తన గణపతిపై పెద్ద ఎత్తున ప్రచారం,అవగాహన కల్పించిన ఎంపీ సంతోష్…ప్రతి ఒక్కరు విత్తన గణపతిని ఆరాధ్య గణపతిగా పూజించి ఇంటి ఆవరణలోనే నిమజ్జనం చేయాలని సూచించారు.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి మనకు విముక్తి దొరకాలని ఇందులో భాగంగా విత్తన గణపతి కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు సంతోష్. మొక్కలని పెంచుదాం అడవులను అభివృద్ధి చెందామన్నారు.