లక్షకు చేరువలో కరోనా కేసులు…

102
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 1967 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మృత్యువాతపడ్డారు.

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 99,391కి చేరుకోగా క‌రోనాబారిన‌ప‌డి 737 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,687 యాక్టివ్ కేసులుండగా 76,967 మంది కరోనా నుండి కోలుకున్నారు.

గత 24 గంట‌ల్లో 1,781 మంది క‌రోనా నుంచి కోలుకున్నారని…..15,332 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపింది వైద్య,ఆరోగ్య శాఖ. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 473, రంగారెడ్డి జిల్లాలో 202, మేడ్చ‌ల్ లో 170, క‌రీంన‌గ‌ర్‌లో 86 కేసులు న‌మోదు అయ్యాయి.