లాక్ డౌన్‌పై ఎలాంటి నివేదిక ఇవ్వలేదు:శ్రీనివాసరావు

25
srinivasa rao

తెలంగాణలో ఏప్రిల్ 30 తర్వాత ఏ క్షణమైన లాక్ డౌన్ ఉండే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో స్పందించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. లాక్‌డౌన్‌పై వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌భుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వ‌లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ‌లో కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌లో స్థిర‌త్వం వ‌చ్చిందని….. ప్ర‌జ‌లు ఇలాగే జాగ్ర‌త్త‌లు పాటిస్తే మ‌రో 3-4 వారాల్లో వైర‌స్ అదుపులోకి వ‌స్తుందని పేర్కొన్నారు. కాబ‌ట్టి లాక్‌డౌన్ పెట్టాల‌నే ఆలోచ‌న కానీ, ప్ర‌తిపాద‌న‌లు కానీ ఏమీ ఇవ్వ‌లేదని.. క‌నీసం అటువంటి ఉద్దేశం కూడా వైద్య ఆరోగ్యశాఖ‌కు లేదన్నారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాల‌ని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపిన‌ట్లు ప‌లు ఎల‌క్ట్రానిక్ మీడియా, సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదన్నారు.