సినిమా రంగుల ప్రపంచం. రంగుల ప్రపంచంలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోవచ్చని ఎంతోమంది భావిస్తుంటారు. ఇక తెరపై కనిపించే హీరోలు,కమెడీయన్లు,దర్శకులు,నిర్మాతలకు ఎంతో గుర్తింపు ఉంటుంది. కానీ తెర వెనుక సినిమా అద్భుతంగా రావడానికి కారణమైన వారిపేర్లు చాలామంది తెలియవు. ఎవరు తెలుసుకోవాలనే ప్రయత్నం చేయరు.
సినిమాను అద్భుత దృశ్యకావ్యంగా రూపొందించడంలో సాంకేతిక నిపుణల పాత్ర కీలకం. దర్శకుల ఆలోచనలకు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ జోడించి అద్భుత దృశ్య కావ్యంగా మలిచి సినిమాను ప్రేక్షకుల అభిరుచికి తగ్గేట్లుగా తీర్చిదిద్దుతారు. అలాంటి సాంకేతిక నిపుణుల్లో అగ్రస్ధానంలో ఉంటారు శ్రీనివాస్ మోహన్.
అలాంటి శ్రీనివాస్ మోహన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అవార్డ్స్ అందించే ది అకాడమీ సంస్థలో శ్రీనివాస్ ప్యానల్ సభ్యుడుగా పిలుపు అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి శ్రీనివాస్ మోహన్ అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
ప్రపంచస్థాయిలో చాలామంది వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్లు ఉన్నప్పటికీ ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్ అకాడమీ నుంచి మీకు పిలుపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ సర్ అని ట్వీట్ చేశారు రాజమౌళి. బాహుబలి: ది బిగినింగ్, 2.ఓ, రోబో, క్రిష్, ఐ వంటి చిత్రాలకు అద్భుత విజువల్ ఎఫెక్ట్స్ అందించారు శ్రీనివాస్.
Extremely glad that you have become one of the very few VFX Supervisors around the world to be invited by The Academy. Congratulations sir.. 🙂 https://t.co/I1Ww7iK1A8
— rajamouli ss (@ssrajamouli) July 3, 2019