ఆ ధైర్యం ఎవరు చేయగలరు?..రాహుల్ రాజీనామాపై ప్రియాంక ట్వీట్

221
rahul_priyanka.jpeg

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను ఆమోదించాలంటూ నిన్న ఆయన మీడియా ద్వారా ఓ లేఖను కూడా విడుదల చేశారు. తాజాగా రాహుల్ రాజీనామా పై స్పందించారు ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. రాహుల్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ప్రియాంక ట్వీట్ చేసింది. ఇటువంటి నిర్ణయం తీసుకునే ధైర్యం కొద్దిమందికే ఉంటుందని.. ఇంకెవరయినా ఇలా చెయ్యగలరా అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ నిర్ణయాన్ని గౌరవిస్తూన్నానని తెలిపారు. రాహుల్ గాంధీ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్న ట్విట్టర్‌లో నాలుగు పేజీల రాజీనామా లెటర్‌ పెట్టారు. లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు అందులో తెలిపారు. ఇక ఎంత మాత్రం అధ్యక్ష పదవిలో కొనసాగలేనన్న ఆయన… వెంటనే మరో అధ్యక్షుణ్ని ఎంపిక చెయ్యాల్సిందిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను కోరారు.

మరోవైపు తన ట్వీట్టర్ ప్రోఫైల్ లో కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాను తొలగించి జాతీయ కాంగ్రెస్ సభ్యుడు, ఎంపీ అని మాత్రమే రానుకున్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మోతితాల్ వోరాను నియమించారు. కొత్త అధ్యక్షుడిని నియమించే వరకూ వోరానే అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.