జ్యోతిభా పూలేకు ఘన నివాళి..

313
srinivas goud
- Advertisement -

మహాత్మా జ్యోతిభా పూలే గారి 194 వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే గారి సేవలను గుర్తుచేసుకున్నారు. భారత దేశ, సమాజ పునర్నిర్మాణంలో జ్యోతిరావు పూలే గారి సేవలు అందరికి ఆదర్శంగా నిలిచాయన్నారు.

మహాత్మా జ్యోతిరావు పూలే గారి అడుగుజాడల్లో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నడుస్తున్నారన్నారు. అభినవ పూలే మన కేసీఆర్ గారు అని అభివర్ణించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి, అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. అందులో భాగంగా BC, SC, ST మరియు మైనారిటీ వర్గాల కోసం గురుకులాలు స్థాపించి మెరుగైన విద్యా ను అందిస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ .

వెనుకబడిన తరగతుల కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించని విధంగా సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందన్నారు. వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలకు వేలకోట్ల విలువైన భూములు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘము అధ్యక్షురాలు శ్రీమతి మమత గారు, TNGO కేంద్ర సంఘము అధ్యక్షులు శ్రీ కారం రవీందర్ రెడ్డి, TGO ఉపాధ్యక్షులు శ్రీ సత్యనారాయణ, TNGO జనరల్ సెక్రటరీ మామిడ్ల రాజేందర్ లు పాల్గొన్నారు.

- Advertisement -